జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయాలా? వద్దా?

35చూసినవారు
జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయాలా? వద్దా?
వర్షాకాలం, శీతాకాలంలో వైరల్ ఫీవర్స్ రావడం సర్వసాధారణం. జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయకూడదనేది కేవలం అపోహ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల అలసట, ఒళ్లు నొప్పులు, చిరాకు తగ్గి ఉపశమనం లభిస్తుంది. చల్లని నీటితో స్నానం చేయకూడదు. జ్వరం ఎక్కువగా ఉంటే గోరువెచ్చని నీటిలో తడిపిన కాటన్ టవల్‌తో శరీరాన్ని తుడవడం మంచిది. స్నానం 5-10 నిమిషాల్లో ముగించి, వెచ్చని దుస్తులు ధరించాలి.

సంబంధిత పోస్ట్