ఎయిర్ ఇండియా పైలట్లకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు

9543చూసినవారు
ఎయిర్ ఇండియా పైలట్లకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు
భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై ఎయిర్ ఇండియా కాక్‌పిట్ సిబ్బందికి విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ-టోక్యో మధ్య నడిచిన AI-357, AI-358 విమానాల్లో భద్రతా లోపాలు, నిబంధనల అతిక్రమణ ఉన్నా.. వాటిని పట్టించుకోకుండా విమానాలను నడిపినందుకు ఈ నోటీసులు పంపింది. 'మినిమమ్ ఎక్విప్‌మెంట్ లిస్ట్ (MEL)' నిబంధనలకు అనుగుణంగా లేవని, ఇది గతంలోనూ వేరే సెక్టార్లలోనూ జరిగిందని డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ట్యాగ్స్ :