తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) కమిషనర్ డాక్టర్ జె.అజయ్ కుమార్ గురువారం యాదాద్రి జిల్లాలోని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓపి విభాగం, వార్డుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనుమతులు లేకుండా గైర్హాజరైన ముగ్గురు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వైద్యులు రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు.