'శ్రాద్ధకర్మ'.. ఖచ్చితంగా చేయాలా?

పరమపదించిన మన పూర్వీకులను, వారి త్యాగాలు, విలువలు, ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకునేందుకు సనాతన ధర్మం ఏర్పరచిన అత్యుత్తమ విధానం 'శ్రాద్ధకర్మ'. మనకు ఒక ఏడాది కాలం పితృదేవతలకు ఒక రోజుతో సమానం. పితృ కర్మలు నిర్వహించే కాలం మహాలయ పక్షం. ముఖ్యంగా ఈ పక్షపు చివరిరోజైన పితృ అమావాస్య రోజు పెద్దలకు తర్పణం ఇస్తారు. ఏడాదికి ఒకసారి మనం పెట్టే పిండ తర్పణం.. వారికి ఒకరోజు భోజనం. ఈ విధానాన్ని ఖచ్చితంగా శ్రద్ధతో చేయాలి కనుక దీనికి శ్రాద్ధకర్మ అని పేరు.
