ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Jan 16, 2026, 15:01 IST/

పురుషులు గ‌ర్భం దాల్చ‌గ‌ల‌రా.. అమెరికా సేనేట‌ర్ ప్ర‌శ్న‌కు డాక్ట‌ర్ నిషా వ‌ర్మ కౌంట‌ర్

Jan 16, 2026, 15:01 IST
అమెరికా సేనేటర్ జోష్ హౌలే, అబార్షన్ మాత్రలపై జరిగిన సెనేట్ హౌస్ కమిటీ సమావేశంలో భారతీయ సంతతికి చెందిన ప్రసూతి వైద్యురాలు నిషా వర్మను పురుషులు గర్భం దాల్చుతారా అని సుమారు 14 సార్లు ప్రశ్నించారు. దీనికి డాక్టర్ నిషా వర్మ నేరుగా సమాధానం ఇవ్వకుండా, ఆ ప్రశ్న వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. సైన్స్, ఆధారాలు చికిత్సకు మార్గం చూపాలని, ఇలాంటి 'ఎస్ ఆర్ నో' ప్రశ్నలు రాజకీయ పరికరాలని ఆమె అన్నారు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.