శ్రేయస్ అయ్యర్ మార్చి 2026 వరకు క్రికెట్‌కు దూరం

25672చూసినవారు
శ్రేయస్ అయ్యర్ మార్చి 2026 వరకు క్రికెట్‌కు దూరం
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మార్చి 2026 వరకు క్రికెట్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో క్యాచ్ ప్రయత్నంలో అతని ప్లీహానికి తీవ్రమైన గాయం కావడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అల్ట్రాసోనోగ్రఫీలో కొంత మెరుగుదల కనిపించినా, కడుపుపై ఒత్తిడి వచ్చే పనులు చేయవద్దని వైద్యులు సూచించారు. దీంతో అతను సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సిరీస్‌లు మరియు టీ20 ప్రపంచకప్‌ను కోల్పోవడం ఖాయమైంది. ఐపీఎల్ 2026 నాటికి తిరిగి ఆడే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్