శ్రియాశరణ్ 'సందకారి' సెప్టెంబర్ 18న విడుదల

6142చూసినవారు
శ్రియాశరణ్ 'సందకారి' సెప్టెంబర్ 18న విడుదల
శ్రియాశరణ్ నటించిన తమిళ చిత్రం 'సందకారి' సెప్టెంబర్ 18న విడుదల కానుంది. ఈ చిత్రం 2012లో వచ్చిన మలయాళ చిత్రం 'మై బాస్'కి రీమేక్. సినిమా విడుదల కాకముందే ఉత్తమ సినిమా, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ విభాగాల్లో మూడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై విమర్శలు వచ్చినా, తాజాగా విడుదల తేదీని ప్రకటించారు.

శ్రియా శరణ్‌ నటించిన తమిళ చిత్రం ‘సందకారి’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. విమల్‌, శ్రియా జంటగా నటించిన ఈ రొమాంటిక్‌ కామెడీ మూవీని ఆర్‌. ధేశ్‌ తెరకెక్కించారు. 2019లో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా చాలాకాలంగా విడుదలకు నోచుకోలేదు. అయితే 2020 తమిళనాడు స్టేట్‌ ఫిలిం అవార్డ్స్‌లో మూడు పురస్కారాలు దక్కించుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. మలయాళ ‘మై బాస్‌’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 18న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

సంబంధిత పోస్ట్