నటి శృతిహాసన్ ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్ హ్యాక్ అయింది. 7.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఆమె అకౌంట్‌ని క్రిప్టో కరెన్సీ బ్యాచ్ టార్గెట్ చేసి హ్యాక్ చేసింది. హ్యాకింగ్ అనంతరం తమ క్రిప్టో ప్రమోషన్లు పోస్టు చేయడం ప్రారంభించింది. ఈ క్రిప్టో కరెన్సీ బ్యాచ్ భారీ ఫాలోవర్స్ ఉన్న అకౌంట్లను టార్గెట్ చేస్తూ ఉంటుందని సమాచారం.