విద్యార్థులకు శుభాంశు శుక్లా సక్సెస్‌ టిప్స్‌!

5819చూసినవారు
భారత వ్యోమగామి, గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా చిన్నతనంలో తాను వ్యోమగామి అవుతానని ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. దిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శనలో విద్యార్థులతో మాట్లాడుతూ, జీవితంలో కొత్త అవకాశాలను స్వీకరించడమే తనను ఈ స్థాయికి చేర్చిందని చెప్పారు. ఆచరణ, తర్కం పేరుతో ఉత్సాహాన్ని అణచివేయకూడదని, తొలి అడుగు వేస్తేనే పరిష్కారం దొరుకుతుందని, లక్ష్య సాధనలో ఒడుదొడుకులను ఎదుర్కొంటూ ప్రయత్నిస్తేనే విజయం సాధించవచ్చని ఆయన విద్యార్థులకు సూచించారు.