కేరళలో జపనీస్ ఎన్‌సెఫలైటిస్ వ్యాధి కలకలం రేపుతోంది. గడిచిన వారం రోజుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోగా, ఈ ఏడాది మొత్తం మృతుల సంఖ్య 26కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 300 కేసులు నమోదయ్యాయని కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. 10 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులపై ఈ వ్యాధి ఎక్కువ ప్రభావం చూపుతోంది. 35 జిల్లాల్లో 33 జిల్లాల్లో వ్యాధి వ్యాప్తి ఉండగా, కేవలం రెండు జిల్లాల్లో మాత్రమే దాని ప్రభావం లేదు.