
ప్రభాస్ 'ది రాజాసాబ్' కు లీకుల బెడద
స్టార్ హీరోల చిత్రాలకు సంబంధించిన వీడియో లీకులు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి. అధికారిక విడుదల వరకు సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినా మేకర్స్ కు సాధ్యపడటం లేదు. ప్రభాస్ నటిస్తున్న 'ది రాజాసాబ్' చిత్ర బృందాన్ని లీకుల బెడద వెంటాడుతోంది. సినిమాలో ప్రభాస్ లుక్ తో పాటు, టీజర్ కూడా ముందే లీక్ అయింది. తాజాగా విదేశాల్లో జరుగుతున్న సాంగ్ షూట్ కు సంబంధించిన క్లిప్ కూడా వైరల్ అవుతోంది. దీంతో దర్శక నిర్మాతలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.




