రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి.. వెలుగులోకి సీసీ ఫుటేజ్

0చూసినవారు
TG: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. నెక్లెస్ రోడ్‌లో విధుల్లో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం టూ టౌన్ ఎస్ఐ వెంకన్నను గుర్తుతెలియని బైక్ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన వేంకన్నను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. ఆయన స్వగ్రామం రాయపర్తి మండలం కిష్టాపురం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్