బీజేపీ మహిళా నాయకురాలిపై బూతులతో రెచ్చిపోయిన ఎస్‌ఐ(వీడియో)

24530చూసినవారు
ఏపీలో బీజేపీ మహిళా నాయకురాలిపై ఓ ఎస్‌ఐ బూతులతో రెచ్చిపోయాడు. ఈ ఘటన విజయవాడలోని అజిత్‌సింగ్‌ నగర్‌లో చోటు చేసుకుంది. వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజే బంద్‌ చేయాలని చెప్పే క్రమంలో స్థానికులకు ఎస్‌ఐ దుర్గా మహేశ్వరరావుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సంయమనం కోల్పోయిన ఎస్‌ఐ బీజేపీ మహిళా నాయకురాలిని బొచ్చు అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఈ వీడియో వైరల్ ఆకవడంతో ఎస్ఐపై అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్