న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో ఒక ఎస్‌ఐ మద్యం సేవించి కారు డ్రైవ్ చేశాడు. సివిల్ దుస్తుల్లో ఉన్న ఆయన మద్యం మత్తులో రోడ్డుపై హంగామా చేశాడు. వాహనాలు మళ్లించేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి కారుతో దూసుకెళ్లాడు. అడ్డుకుని నిలదీసిన పోలీస్ అధికారి, పోలీస్ సిబ్బందిపై రంకెలు వేశాడు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో డిసెంబర్ 31 అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. బారాబంకి పోలీస్ లైన్స్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ అమిత్ జైస్వాల్‌గా గుర్తించి.. అతడ్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.