సైబీరియా రాబందు 'మారిచ్' 15 వేల కి.మీ. ప్రయాణం

32087చూసినవారు
సైబీరియా రాబందు 'మారిచ్' 15 వేల కి.మీ. ప్రయాణం
మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లా నుంచి బయలుదేరిన యురేసియన్‌ గ్రిఫాన్‌ రాబందు ‘మారిచ్’, 15 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని భారతదేశానికి సురక్షితంగా తిరిగి వచ్చిందని అటవీ శాఖాధికారి తెలిపారు. ఈ పక్షి పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజకస్థాన్‌ల గుండా ప్రయాణించి, ప్రస్తుతం రాజస్థాన్‌లోని ధోల్‌పుర్‌ జిల్లాలో తిరుగుతోంది. ఉపగ్రహ రేడియో కాలర్‌ సహాయంతో దాని కదలికలను అటవీ శాఖ గమనిస్తోంది. జనవరి 29న గాయపడిన స్థితిలో కనిపించిన ఈ రాబందుకు చికిత్స అందించి, విడుదల చేశారు. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది.
Job Suitcase

Jobs near you