కర్ణాటక రాజకీయాల్లో మరోసారి కీలక భేటీ జరుగుతోంది. సీఎం సిద్ధరామయ్యను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించారు. ఈ మేరకు త్వరలో ఇద్దరూ సమావేశం కానున్నారు. ఇటీవల సీఎం మార్పు, నాయకత్వ భేధాలు అంటూ వస్తున్న వార్తలపై చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఈ భేటీని ప్రాధాన్యంగా చూస్తోంది. ప్రభుత్వ స్థిరత్వం, పరస్పర సహకారంపై ఇద్దరి మధ్య చర్చలు జరగనున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.