
ఎల్‌పీజీ సిలిండర్ ధరలను యథాతథంగా కొనసాగించాలి: కేంద్రం
ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కేజీల గృహ సిలిండర్ ధర రూ. 913గా ఉంది. అయితే, వాణిజ్య వినియోగదారులకు మాత్రం 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను సగటున రూ. 993 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం గృహ వినియోగదారులకు కొంత ఉపశమనాన్ని కలిగించగా, వాణిజ్య సంస్థలకు మాత్రం ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.


































