బొల్లారం: భర్తే అసలు అంతకుడు

1328చూసినవారు
బొల్లారం: భర్తే అసలు అంతకుడు
బొల్లారంలో మీనా అనే మహిళ హత్య కేసులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని నాటకమాడిన భర్త అనిలే అసలు హంతకుడని పోలీసులు తేల్చారు. కూరగాయల మార్కెట్ నుంచి వస్తుండగా దుండగులు గొంతు కోశారని అనిల్ ఫిర్యాదు చేయగా, విచారణలో అతని మాటల్లో పొంతన లేకపోవడంతో నిజాన్ని అంగీకరించాడు. గత 20 ఏళ్లుగా వెంకటేశ్వర కాలనీలో ఉంటున్న వీరి మధ్య హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్