గుమ్మడిదల: మెకానిక్ షెడ్డులో అగ్నిప్రమాదం.. కార్లు దగ్ధం

1520చూసినవారు
గుమ్మడిదల మండలం అన్నారంలోని ఒక కారు మెకానిక్ షెడ్డులో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో అక్కడ పనిచేస్తున్న మెకానిక్లు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటలు వేగంగా వ్యాపించి, షెడ్డులోని రెండు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.

సంబంధిత పోస్ట్