వట్పల్లి: స్పీకర్‌ నుంచి ప్రతిపక్షం వరకు విద్యార్థులే

2242చూసినవారు
వట్పల్లి మండల కేంద్రంలోని పోతులబోగూడ TG మోడల్ స్కూల్&జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎం. దీనా ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్, మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్పీకర్, ప్రధాని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష సభ్యుల పాత్రలు పోషించారు. ప్రశ్నోత్తరాలు, చర్చలను సభావిధానంలో ప్రదర్శించారు. సామాజికశాస్త్ర ఉపాధ్యాయురాలు అరుణకులకర్ణి, ఉపాధ్యాయులు హరీష్, రాజు విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్