Jan 03, 2026, 17:01 IST/
షాకింగ్.. అందరూ చూస్తుండగా రైలు కింద తలపెట్టాడు (వీడియో)
Jan 03, 2026, 17:01 IST
AP: దువ్వాడలో శనివారం దారుణ ఘటన చోటి చేసుకుంది. జీవితంపై విరక్తి చెందిన మాజీ సైనికుడు రైల్వే స్టేషన్ లో అంతా చూస్తుండగా ట్రైన్ కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన నీలాపు వెంకటరెడ్డి కొన్నాళ్లు విశాఖ స్టీల్ ప్లాంటులోనూ పనిచేశారు. ఈక్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం-1పైకి వెళ్లారు. ట్రైన్ రావడాన్ని గమనించి అందరూ చూస్తుండగా వెళ్లి పట్టాలపై పడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.