సిద్దిపేట ప్రజలకు కలెక్టర్ కీలక సూచనలు

4చూసినవారు
సిద్దిపేట ప్రజలకు కలెక్టర్ కీలక సూచనలు
జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు -2026 సడక్ సురక్ష అభియాన్ పురస్కరించుకొని, జనవరి 1 నుంచి 31 వరకు రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కేహైమావతి తెలిపారు. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలు పాటించి, క్షేమంగా ఇంటికి చేరడమే ముఖ్య ఉద్దేశమని, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున, నియమాలు పాటించడం, హెల్మెట్ ధరించడం, లైసెన్స్ కలిగి ఉండటం, సిగ్నల్స్, మార్కింగ్స్ తెలుసుకొని జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. జిల్లాలో ప్రమాదాలు తగ్గించేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించి, కరపత్రం ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్