Dec 13, 2025, 17:12 IST/
మెస్సీతో మ్యాచ్.. గోల్ కొట్టిన రేవంత్‌రెడ్డి (వీడియో)
Dec 13, 2025, 17:12 IST
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన గోట్ కప్ ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి ఆర్‌ఆర్ టీమ్ తరఫున ఆడి గోల్ చేశారు. మెస్సీ రెండు గోల్స్ సాధించగా, చివరికి సింగరేణి ఆర్‌ఆర్ టీమ్ 3-0 గోల్స్‌తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పిల్లలు వీక్షించారు. మ్యాచ్ అనంతరం మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ విజేతలకు ట్రోఫీలు అందించారు.