May 15, 2026, 02:05 IST/
యూసుఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం (వీడియో)
May 15, 2026, 02:05 IST
హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో విశ్వ విహార్ లాండ్ మార్క్ అపార్టుమెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అపార్టుమెంట్‌లోని ఐదో అంతస్తులో పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. అపార్టుమెంట్‌లోని నివాసితులను సురక్షితంగా ఖాళీ చేయించి, మంటలను ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఏసీ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.