May 16, 2026, 02:05 IST/
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
May 16, 2026, 02:05 IST
AP: కాకినాడ జిల్లాలోని కొవ్వూరు బ్రిడ్జి వద్ద శనివారం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఉపాధి కూలీలను టిప్పర్ లారీ బలంగా ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.