ఈ నెల 15న జరగనున్న లోక్ అదాలత్‌లో అధిక మొత్తంలో కేసులు రాజీ కుదర్చాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రిన్సిపల్, సీనియర్ సివిల్ జడ్జి మిలింద్ కాంబ్లే అన్నారు. స్పెషల్ లోక్ అదాలత్ సందర్భంగా సిద్దిపేట కోర్టు భవనంలో జిల్లా బ్యాంకు మేనేజర్లు, స్టాండింగ్ కౌన్సిల్స్ తో న్యాయమూర్తి సమావేశం నిర్వహించారు. జిల్లాలో బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్ కేసులు పెండింగ్లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.