అనాథలైన చిన్నారులకు అండగా అఖిల రాజ్ ఫౌండేషన్

0చూసినవారు
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ వార్డుకు చెందిన సంగోజి వెంకటస్వామి, ఆయన భార్య పల్లవి ఇటీవల మరణించడంతో వారి కుమారుడు విషగ్న, కూతురు తేజేశ్వని అనాథలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అఖిల రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూకట్ పల్లి ఎస్ఐ తౌడ సత్యనారాయణ చిన్నారులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. బుధవారం ట్రస్టు సభ్యులు బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. పిల్లల బంధువులు అంగీకరిస్తే వారిని దత్తత తీసుకుంటామని, ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా నిలవడమే తమ ధ్యేయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. అనాథలైన పిల్లలకు మానవత్వం ఉన్నవారు సహకరించాలని వారు కోరారు. బాధిత కుటుంబ సభ్యులు ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్