మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేసి, అనుమతి లేకుండా సెలవులు తీసుకోవద్దని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సెలవులు వినియోగించుకోవాలని, లేనియెడల జీతంలో కోత విధిస్తామని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు. కాలం చెల్లిన మందులు వాడకూడదని ఫార్మాసిస్ట్ ను ఆదేశించారు.