దుబ్బాక పట్టణంలో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ వేడుకలు జరిగాయి. ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు 'సద్దుల బతుకమ్మ' లేదా 'పెద్ద బతుకమ్మ'గా గౌరమ్మను ఆరాధించడం తెలంగాణ సాంప్రదాయం. మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ, ఆడుతూ తమ కష్టసుఖాలను పంచుకున్నారు. ఈ పండుగ ప్రతి ఇంట్లో ఆనందాన్ని నింపి, అందరూ సుఖశాంతులతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని గౌరమ్మను వేడుకున్నారు. తెలంగాణ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.