గ్రామాల్లో బెల్ట్ షాపుల దందా: యువత భవిష్యత్తు అంధకారం

747చూసినవారు
గ్రామాల్లో బెల్ట్ షాపుల దందా: యువత భవిష్యత్తు అంధకారం
అక్బరుపేట భూంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో బెల్ట్ షాపుల దందా రోజురోజుకు పెరుగుతోంది. పట్టణాల్లో రాత్రిపూట దొరకని మద్యం, మండల కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఏ రాత్రి అయినా ఏటీఎంలా అందుబాటులో ఉంటోంది. దీనివల్ల ప్రధానంగా యువత పెడదారిన పట్టి, తమ భవిష్యత్తును అబాసుపాలు చేసుకుంటున్నారు. గ్రామాల్లో మద్యం అమ్మకాలతో యువత మత్తులో ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కొందరు యువకులు మహిళలను వేధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.

సంబంధిత పోస్ట్