ఉపాధి హామీ కార్మికుల మధ్య ఘనంగా జన్మదిన వేడుకలు

2చూసినవారు
తెలంగాణ ఉద్యమ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు కారణ జన్ముడని బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. బుధవారం హరీశ్ రావు జన్మదినోత్సవం పురస్కరించుకొని తొగుట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో వనం చెరువు వద్ద గ్రామ సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్ తో కలిసి ఉపాధి హామీ కార్మికుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ దశలోనూ, రాష్ట్ర సాధన అనంతరం పాలనా దశలోనూ ప్రజల మధ్యే ఉంటూ తెలంగాణ అభివృద్ధికి విశేష సేవలందించిన నేతగా ఆయన గుర్తింపు పొందారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్