దౌల్తాబాద్: వరి కొయ్యలు కాల్చొద్దు.. సన్నరకం సాగు పెంచండి

1చూసినవారు
దౌల్తాబాద్: వరి కొయ్యలు కాల్చొద్దు.. సన్నరకం సాగు పెంచండి
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గొడుగుపల్లి, దొమ్మాట, హైమద్ నగర్ గ్రామాలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వరి కొయ్యలు కాల్చడం వల్ల భూసారం తగ్గిపోవడంతో పాటు పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని, నేలలోని సూక్ష్మజీవులు నశించి భూమి సారవంతత తగ్గిపోతుందని అధికారులు వివరించారు. రైతులు కొయ్యలను కాల్చకుండా పశువుల మేతగా, సేంద్రీయ ఎరువుల తయారీలో లేదా ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. ఎరువుల సమతుల వినియోగంపై కూడా రైతులకు సూచనలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్