దౌల్తాబాద్: రోడ్లపై వడ్లు, మొక్కజొన్నలు ఆరబోస్తే కఠిన చర్యలు

755చూసినవారు
దౌల్తాబాద్: రోడ్లపై వడ్లు, మొక్కజొన్నలు ఆరబోస్తే కఠిన చర్యలు
శనివారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఎస్సై గంగాధర అరుణ్ కుమార్, రోడ్లపై వడ్లు, మొక్కజొన్నలు ఆరబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్థులను హెచ్చరించారు. రోడ్లపై ధాన్యం ఆరబోయడం వల్ల వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని, ధాన్యం ఆరబోతలకు కల్లాలను మాత్రమే ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :