దౌల్తాబాద్: మండల వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

1చూసినవారు
దౌల్తాబాద్: మండల వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామ పంచాయతీలలో జాతీయ పతాకాలను ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ చంద్రశేఖర్ రావు, ఎంపీడీవో అఫ్జలొద్దీన్, ఏపీఎం మహిపాల్, మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు, ఎస్సై అరుణ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ ఐలపురం కనకయ్య వంటి అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్