దుబ్బాక: బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయాలి

73చూసినవారు
దుబ్బాక: బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న 46శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయడంతో పాటు బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయాలని బహుజన లెబరల్ ఫ్రంట్ జాతీయ చైర్మన్ రామకృష్ణ ప్రభు అన్నారు. బుధవారం దుబ్బాకలో బీసీ ఉద్యమ నేతలతో కలిసి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 78 సంవత్సరాలు గడుస్తున్నా సరైన వాటా దక్కడం లేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు వెంకటచారి, చంద్రయ్య, సుమన్, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్