సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని అప్పనపల్లి గ్రామంలో బుధవారం బెల్ట్ షాపుపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి, మెరుగు సత్యనారాయణ ఇంట్లో అక్రమంగా విక్రయిస్తున్న 26.09 లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కీర్తి రాజ్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.