దుబ్బాక బీజేపీ నాయకులు ఎంపీ రఘునందన్ రావును కలిశారు

584చూసినవారు
దుబ్బాక బీజేపీ నాయకులు ఎంపీ రఘునందన్ రావును కలిశారు
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు హైదరాబాద్‌లో మెదక్ ఎంపీ రఘునందన్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ రుద్రారం యాదగిరి, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు సిద్దిన రుద్రారం కర్ణాకర్ గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గన్నేబోయిన చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్