సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని హబ్సిపూర్ గ్రామంలో శనివారం ఒక రైతు వ్యవసాయ భూమిలో విద్యుత్ స్తంభం కూలిపోవడంతో, అక్కడ మేత మేస్తున్న ఒక పాడి గేదె విద్యుత్ షాక్‌తో మరణించింది. సుమారు లక్ష రూపాయల విలువైన గేదె మరణించడంతో రైతు కుటుంబానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని రైతు భూపాల్ కన్నీరుమున్నీరయ్యారు.