దుబ్బాక: దామోదర్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

0చూసినవారు
దుబ్బాక: దామోదర్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు
సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. శనివారం తుంగతుర్తి పట్టణంలో దామోదర్ రెడ్డి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దామోదర్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి అని, క్రమశిక్షణతో, అంకితభావంతో పార్టీ కోసం పనిచేశారని, ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :