సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సబ్సిడీపై విత్తనాల పంపిణీ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చెరుకు విజయ్ అమర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతుల అభ్యున్నతి, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపై అందించడం ద్వారా సాగు వ్యయాన్ని తగ్గించి అధిక దిగుబడులు సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రైతుల ఆర్థిక భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంటేనే అధిక దిగుబడులు సాధించడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.