సిద్దిపేట డీఐఈవో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఇంటర్మీడియట్ కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు, అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా విద్యాబోధన అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.