దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి మూడు ఉత్తమ అవార్డులు లభించాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఈ అవార్డులను సూపరిండెంట్ డాక్టర్ హేమ్రాజ్ సింగ్ అందుకున్నారు. దుబ్బాక వంద పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ హేమ్రాజ్ సింగ్ మాట్లాడుతూ, ఆసుపత్రిలోని అన్ని విభాగాల డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, ఆఫీస్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, ఆరోగ్యశ్రీ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది అందరి కృషి, పట్టుదల, సహకారంతోనే ఈ అవార్డులు సాధ్యమయ్యాయని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆసుపత్రి సిబ్బంది చూపిన అంకితభావానికి గుర్తింపుగా ఈ అవార్డులు లభించాయి.