
మాల్దీవ్స్ లో మహేశ్ బాబు.. ఫోటో వైరల్
వెకేషన్కు మాల్దీవ్స్ వెళ్లిన మహేష్ బాబు ఫోటో వైరల్ అయ్యింది. SSMB29 సినిమా షూటింగ్కు విరామం దొరకగానే కుటుంబంతో అక్కడికి వెళ్లారు. అక్కడ సముద్రంలో అలల మధ్య ప్రయాణిస్తున్న ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'అద్భుతమైన ప్లేస్లో అద్భుతమైన అనుభవం థాంక్యూ ఫర్ ద వండర్ఫుల్ స్టే అంటూ ఇన్స్టా లో రాసుకొచ్చారు. ఇక మహేష్ ఫేస్ కనిపించకపోయినా ఫోటోను ఫాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.




