గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6న హైదరాబాద్‌లో జరిగే ప్రశ్నించే గొంతులు సాధించిన విజయాలపై రాష్ట్ర స్థాయి సభను జయప్రదం చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ పిలుపునిచ్చారు. బుధవారం దుబ్బాకలో గద్దర్ ఫౌండేషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ పై కాల్పులు జరిగిన రోజున, ప్రతి సంవత్సరం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తారని, ఈ దినాన్ని గద్దర్ పునర్జన్మ దినంగా పాటిస్తారని నాయకులు తెలిపారు.