దుబ్బాక: కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానిని కలిసిన ఎంపీ

60చూసినవారు
దుబ్బాక: కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానిని కలిసిన ఎంపీ
మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. పార్లమెంట్లోని పీఎం ప్రత్యేక కార్యాలయంలో ఎంపీ తన సతీమణి మంజుల, కూతురు సింధు, అల్లుడు, మనవరాళ్లతో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. తన మనువరాళ్లను మోదీ ఎంతో ఆప్యాయంగా ఎత్తుకొని చాక్లెట్ లు ఇచ్చి, వారితో కాసేపు ఆడుకున్నారని తెలిపారు. తమ కుటుంబంతో ప్రధాన మంత్రిని కలవడం సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్