దుర్గామాత కృపతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. పలు గ్రామాల్లో దుర్గామాత నిమజ్జనోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, తెలంగాణలో అన్ని పండుగలు ఘనంగా జరుపుకొనే మంచి సంస్కృతి, సాంప్రదాయాలు తరాల నుంచి వస్తున్నాయని తెలిపారు. భక్తి భావంతో పాటు ప్రజలు ఐకమత్యంగా గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.