దుబ్బాక: రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయము

1చూసినవారు
దుబ్బాక: రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయము
హబ్సిపూర్ ట్రాన్స్ కో సబ్ స్టేషన్లో నిర్వహణ పనుల కారణంగా, దుబ్బాక మండలం, అక్బర్ పేట్- భూంపల్లి మండలంలోని బొప్పాపూర్, చిట్టాపూర్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు, మిరుదొడ్డి మండలంలోని కాసులాబాద్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో మంగళవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని దుబ్బాక సహాయక డివిజనల్ ఇంజనీర్ సిహెచ్. గంగాధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు, రైతులు సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్