పీఆర్ టీయూటీఎస్ దుబ్బాక రూరల్ మండల శాఖ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్, ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దుబ్బాక లోని మండల వనరుల కేంద్రం వద్ద ఎంఈఓ జోగు ప్రభుదాస్ చేతుల మీదుగా పీఆర్ టీయూటీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షులు వేణుగోపాల చారి, జనార్ధన్, రామ్ రెడ్డి, ఎంఆర్సీ సిబ్బంది గణేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.