సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ రైతు వేదికలో సోమవారం డీసీఎంఎస్, ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో విత్తన మేళా జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్, ఏఈఓ రేణుక, ఎఫ్‌పీఓ చైర్మన్ తీపిరెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన ఏడు రకాల సన్న వడ్లు, మూడు రకాల దొడ్డు వడ్లను సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు.