దుబ్బాకను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే

17చూసినవారు
దుబ్బాకను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రతి వార్డులో అభివృద్ధి పనులు వేగవంతం చేసి దుబ్బాకను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. సోమవారం దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గం తొలి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్, వైస్ చైర్‌పర్సన్ ఆస సులోచన స్వామి, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, అధికారులు పట్టణ సమస్యలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్